హీరో ఎన్టీఆర్‌పై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు అంటూ కొనియాడారు. "ఆర్ఆర్ఆర్ : బిహైండ్ అండ్ బియాండ్" అనే డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదలకానుంది. ఈ డాక్యుమెంటరీ ప్రచారంలో భాగంగా జపాన్‌కు వెళ్లిన రాజమౌళి... అక్కడ మీడియాతో మాట్లాడుతూ, తారక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.