ఎస్.ఎస్.ఎం.బి.29 కథను విజయేంద్రప్రసాద్ రాశారు. జంగిల్ ఎడ్వంచర్ కథగా రూపొందించారు. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఆస్కార్ అవార్డులలో ఈ సినిమా యాక్షన్ కేటగిరిలో అవార్డుల కోసం ఎంట్రీ కి పంపనున్నట్లు సమాచారం. 2028లో 100 ఏళ్ళ ఆస్కార్ వేడుక జరగనుంది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా నిలవనుంది.
ఇక హాలీవుడ్ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఎడ్వంచరీ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలను, వి.ఎఫ్.ఎక్స్ సిబ్బందినిఇప్పటికే రాజమౌళి కలిసినట్లు వెల్లడించారు. తెలుగు సినిమాలో ఆర్.ఆర్.ఆర్. కు మించిన సినిమా ఇది కాబోతుందని రాజౌళి టీమ్ చెబుతోంది. ప్రియాంకచోప్రా, ప్రుథ్వీరాజ్ కుమార్ ఇప్పటికి ఎంపికైన తారాగణం.