తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. రెడ్డి మామ అంటూ హుషారుగా సాగే ఈ పాటను సురేష్ గంగుల రచించారు. నకాష్ అజిజ్, సాహితి చాగంటి ఆలపించగా.. ఆర్ఆర్ ధృవణ్ మంచి ఊపున్న బీట్‌ను అందించారు. ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని దిల్ రాజు మెచ్చుకున్నారు. చిత్రయూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు.
నటీనటులు : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘనా ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ తదితరులు