నాగచైతన్యతో విడాకులు తీసుకొని సమంత అభిమానులందరికీ షాక్ ఇచ్చింది. విడాకుల న్యూస్ తెలుగు ఇండస్ట్రీనే కాదు కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ నటులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే విడాకుల తరువాత సమంతపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేసిన సంగతి.. ఆమె కొన్ని యూట్యూబ్ చానెళ్ల పై కేసుపెట్టిన సంగతి కూడా తెలిసిందే..
అయితే సమంత మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం.. ఈ షాకింగ్ డెసిషన్ ఏంటంటే.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలని, ఫోటోలను షేర్ చేసుకునే సమంత త్వరలో సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. విడాకులు తీసుకున్నప్పటి నుండి ఏదొక విషయంలో సమంతను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.