సమ్మోహనం సినిమాతో తన కెరీర్లో మరో సక్సెస్ అందుకున్న సుధీర్ బాబు తాజాగా నటిస్తోన్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఈసారి కూడా మరో అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి హీరోగా నటించడంతో పాటు నిర్మాత కూడా సుధీర్ బాబే కావడం విశేషం. సుధీర్ బాబు ప్రొడక్షన్స్‌ను స్థాపించి, ఆ సంస్థలో మొదటి సినిమాగా నన్నుదోచుకుందువటే చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన వచ్చింది.
పోస్టర్, టీజర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడీగా నభా నటేష్ నటిస్తోంది. ఈ సినిమాతో ఆర్‌ఎస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాని కూడా హాయిగా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఉందనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే... ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేసాడు.