ఆ తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీ అంటే కదల్లేని విగ్రహం కాదన్నారు. దేశమంతా విస్తరించిన విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు అని ఆయన వ్యాఖ్యానించారు. సత్యం, అహింస కోసం జీవించిన గాంధీజీ దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. నిజమైన దేశ భక్తులు గాంధీజీ విలువలను కాపాడాలి అని పేర్కొంటూ రాహుల్ ఓ ట్వీట్ చేశారు.