ఆ వీడియోలో ఓ వ్యక్తి వేగంగా కదిలి వెళ్తున్న రైల్లో నుంచి సెల్ఫీ తీసుకుంటున్నాడు. అతడలా సెల్ఫీ తీయడాన్ని పక్క రైలు బోగీలో వున్న మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. రైలు చాలా వేగంగా వెళ్తోంది. ఇంతలో రైల్వే ట్రాక్ పక్కనే వున్న ఓ వ్యక్తి కర్ర పట్టుకుని రెల్లో సెల్ఫీ తీసుకుంటున్న వ్యక్తి చేతిపై ఒకే ఒక్క దెబ్బ వేసాడు. అంతే... చేతిలో నుంచి సెల్ ఫోన్ జారి కింద పడిపోయింది.