తొలి దశలో భాగంగా అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. నగదు బదిలీకి సంబంధించి ఎంపిక చేసిన ప్రాంతాల్లోని వలంటీర్ల ద్వారా ఈ నెల 18 నుంచి 22 వరకు అంగీకార పత్రాలు తీసుకుంటారు.
23న వీఆర్వో పరిశీలన, 25న తహసీల్దార్ ఆమోదం తీసుకుంటారు. అయితే, కిలో బియ్యానికి ఎంత చెల్లించాలన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. రూ. 12 నుంచి రూ. 15 మధ్య ఇచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది.