భారీ బందోబస్తు మధ్య కృష్ణాజిల్లా గన్నవరం వ్యాధినిరోధక టీకాల కేంద్రం నుంచి అన్ని జిల్లాలకు కోవిడ్ వ్యాక్సిన్ తరలించారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు చేరుకున్నాయి. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్‌లో పనిచేస్తున్న 3.70 లక్షల మంది వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. కేసుల తీవ్రత, ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాకు వేల సంఖ్యలో డోసులు పంపారు.
ఆ ప్రకారంగా, కృష్ణా జిల్లాకు 42,500 డోసులు, గుంటూరు జిల్లాకు 43,500 డోసులు తరలించారు. దాంతోపాటు ప్రకాశం జిల్లా 31 వేలు, నెల్లూరుకు 38,500 డోసులు, వెస్ట్‌గోదావరి 33,500, ఈస్ట్‌గోదావరి జిల్లాకు 47 వేలు డోసులు పంపించారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు 26,500, విశాఖకు 46,500, విజయనగరం 21,500, అనంతపురం జిల్లాకు 35,500, కడప జిల్లాకు 28,500, కర్నూలుకు 40,500 వ్యాక్సిన్ డోసులు తరలించారు.