అంతేకాకుండా, ఉద్యోగులు, పెన్షన్‌దారులకు జీతాలు సకాలంలో ఇవ్వాలని, ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఉద్యోగ సంఘం గవర్నర్ హరిచందన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది.
ఈ అంశాలపై రావత్ స్పందిస్తూ, రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. అయినప్పటికీ ప్రతి నెల ఐదో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని, గతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగిందని చెప్పారు.
ప్రతి నెల 5వ తేదీ నాటికి 95 నుంచి 90 శాతం మంది వేతనాలు, పింఛన్లు చెల్లిస్తున్నామన్నారు. మిగిలిన 5 శాతం మందికి ఖచానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నట్టు చెప్పారు. ఖజానా అధికారులు నెలాఖరులోగా ఉద్యోగుల జీతాలు బిల్లులు చెల్లించగలిగితే కనుక ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించగలుగుతామని చెప్పారు.
రిజర్వు బ్యాంకు, బ్యాంకు సెలవులు, రాష్ట్రంలో నిధులు, అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా చెల్లింపులు జరుపుతున్నట్టు చెప్పారు. గతంలోనూ ఇపుడు ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.