ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాం... ఒక్కర్నీ వదిలిపెట్టం.. చంద్రబాబు

బుధవారం, 16 నవంబరు 2022 (19:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు, అధికారులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సాయంత్రం కర్నూలులో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులకు గట్టి హెచ్చరిక చేశారు. ప్రతి ఒక్క పోలీస్ పేరును నోట్ చేస్తున్నామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చిరించారు. 
 
ఈ రోడ్‌షోకు భారీ స్పందన లభించింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ, వైకాపా ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలోనూ పూర్తిగా విఫలమైందన్నారు. వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామికమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమపై జులుం ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారికి బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమను ఆదరిస్తారించాలని ఆయన పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు