రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనావైరస్ కేసులు ప్రస్తుతం ఏపీలో రెడ్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏపీలో కరోనా కేసులు 10 వేలు దాటిపోయాయి. ఈ నేపధ్యంలో కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించారు. ఇదిలావుంటే బెజవాడ ఇంద్రకీలాద్రిపై లక్ష కుంకుమార్చన నిర్వహించే అర్చకుడికి కరోనాపాజిటివ్ రావడంతో భక్తులు భయాందోళ చెందుతున్నారు.