గుంటూరుకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, హైదరాబాద్‌కు చెందిన యువతిని మూడేళ్ల క్రితం ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల కాపురంలో కలతలు రావడంతో వేరుపడ్డారు. దీంతో పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం ఇప్పించాలని వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో సుబ్రహ్మణ్యంపై వరకట్నం కేసును పోలీసులు నమోదు చేశారు.
దీంతో భార్యపై కూడా భర్త ఫిర్యాదు చేశాడు. తాను కట్నం తీసుకోవడం నేరమైతే, ఆమె కట్నం ఇవ్వడం కూడా నేరమేనని, ఆమెపై కూడా కేసు నమోదు చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. దీనిని వారు పట్టించుకోకపోవడంతో ఆయన ఆర్టీఐ చట్టం కింద సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి అధికారులు స్పందించకపోవడంతో ఆయన ఆర్టీఐ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను సంప్రదించారు.