తిరుపతిలో వ్యాపారస్తుల బంద్‌ - నిర్మానుషంగా మారిన పట్టణం..

బుధవారం, 25 మే 2016 (12:40 IST)
జై సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత తొలిసారి తిరుపతి పట్టణం నిర్మానుషంగా మారింది. కారణం తిరుపతి సీటీఓ శ్రీనివాసుల నాయుడు వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాపారస్తులందరు ఐక్యమై షాపులను మూసేశారు. దీంతో తిరుపతి పట్టణం నిర్మానుషంగా మారింది. ఉదయం నుంచి తిరుపతి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ ఆధ్వర్యంలో బంద్‌ జరుగుతున్న నేపథ్యంలో వ్యాపారస్తులు పట్టణ వీధులలో భారీ స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు.
 
గత కొన్నినెలలుగా సీటీఓ తమను వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే శ్రీనివాసులనాయుడుపై చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. 
 
పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి నుంచి స్కూటర్‌ ర్యాలీ ప్రారంభమైంది. ఒక్కసారిగా బంద్‌తో పట్టణం నిర్మానుషంగా మారింది. స్థానికులకు కనీసం తిరుపతిలో తాగడానికి పాలు కూడా దొరకడం లేదు. పట్టణ వాసుల కష్టాలు అన్నీఇన్నీ కావు. మూడురోజుల పాటు బంద్‌ జరుగనుండడంతో పట్టణ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి