విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని సీహెచ్ఎన్ అగ్రహారం గ్రామానికి చెందిన కరణం పార్వతి అలియాస్ పిల్లా పార్వతి (45) అనే మహిళ ఉంది. ఈమె భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. ఆమె కుమారుడు రమేష్ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. పార్వతి ఊరూరా తిరుగుతూ కారం, వడియాలు అమ్ముకుంటూ జీవనంసాగిస్తోంది.
గతనెల 25వ తేదీన పార్వతి తన గదికి వచ్చిందనీ, ఆ రోజు రాత్రంతా తామిద్దరం కలిసే ఉన్నట్టు చెప్పాడు. ఆసమయంలో పార్వతి ఫోన్లో మరో వ్యక్తితో మాట్లాడటాన్ని గమనించిన తాను... ఎవరితో మాట్లాడుతున్నావంటూ మందలించినట్టు చెప్పాడు. పైగా, తానుండగా వేరేవారితో మాట్లాడటం ఏమిటని ప్రశ్నించానని, దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ఇంట్లో ఉన్న కర్రతో తలపై గట్టిగా కొట్టడంతో పార్వతి చనిపోయినట్టు వివరించాడు.
ఆ తర్వాత ఆమె మెడలోని రెండుపేటల పుస్తులతాడు, చెవిదిద్దులు, వెండి పట్టీలు తీసేసి మృతదేహాన్ని ఆ రోజంతా ఇంటిలోనే ఉంచి, 26వ తేదీ రాత్రి తన సోదరుడు అప్పారావు సహకారంతో ఇంటికి ఒక అర కిలోమీటరు దూరంలో ఉన్న రైల్వేట్రాక్ కల్వర్టు కింద మృతదేహాన్ని పడేసినట్టు చెప్పాడు. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం వల్ల ఎక్కడ అడ్డు తగులుతుందన్న భయంతో ఆమెను హత్య చేసినట్టు వాంగ్మూలం ఇచ్చాడు.