ఇందులో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్యాకేజీ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందేనని, హోదాకు ఏదీ సాటిరాదని అన్నారు. దీనిపై పార్లమెంటులో గొంతు విప్పాలని పార్టీ ఎంపీలకు సూచించారు.