బర్రెకు లేని బాధ గుంజకెందుకో? : విజయసాయి రెడ్డి

బుధవారం, 13 జనవరి 2021 (17:29 IST)
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. బర్రెకు లేని బాధ గుంజకెందుకన్నట్టుగా... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి లేని అక్కర ఎన్నికల కమిషరు నిమ్మగడ్డకు ఎందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ షెడ్యూల్ జారీచేసింది. దీన్ని హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసింది. హైకోర్టు తీర్పును డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీ అప్పీల్ చేసింది. 
 
ఈ పరిణామాలపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ, 'గేదెకు లేని బాధ గుంజకెందుకో? అన్నట్టుంది నిమ్మగడ్డ వ్యవహారం. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్నందున ఎన్నికల విధులు నిర్వహించలేమని ఉద్యోగులు మొరపెట్టుకున్నా ససేమిరా అన్నాడు. చివరకు న్యాయం గెలిచింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ఆటంకాలు తొలిగిపోయాయని' మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
అలాగే, 'కరోనా భయంతో ముక్కుకి గుడ్డ కట్టుకొని హైదరాబాద్‌లో దాక్కున్నారు పెద్ద/చిన్న నాయుడు. 60 నుంచి వందేళ్ల వృద్ధులు కూడా పంచాయితీ ఎన్నికల్లో ఓటేయాలని అంటున్నారు. టీడీపీ బతకదని తెల్సు కాబట్టి ఏపీ ప్రజలు ఏమైనా పర్వాలేదనుకుంటున్నారు. వీళ్లు మనుషులా, రాక్షసులా?' అని విజయసాయిరెడ్డి విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు