నాపరాయి క్వారీలో మట్టిపెళ్లలు పడి ఐదుగురు మృతి

బుధవారం, 11 జులై 2007 (09:58 IST)
గుంటూరు జిల్లాలో నాపరాయి క్వారీలో మట్టిపెళ్లలు పడి ఐదుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి శివారు ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో మంగళవారం సాయంత్రం మట్టిపెళ్లలను తొలగించే పనిలో 11 మంది కూలీలు నిమగ్నమై ఉన్న సమయంలో హఠాత్తుగా ఒక మట్టి పెళ్ల వారిపై పడడంతో వారు మట్టిలో కూరుకుపోయారు.

ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవ సమాధి అయ్యారు. కాగా మృతి చెందిన వారిలో షెక్ పెద దస్తగిరి (50), షేక్ శిలార్ షా (20), షేక్ మౌలాలీ (35), షేక్ చినమౌలాలీ (21)తోపాటు పఠాన్ బాబుజానీ అనే మూడేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో హిమాంబి అనే మహిళా కూలీ ఎడమ కాలు విరిగినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి