చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఒక్క రోజులోనే రూ.5 వేల కోట్లు అప్పు చేశారు..

బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (08:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా అప్పులు చేస్తుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక్క రోజులోనే రూ.5 వేల కోట్లు అప్పు చేసిందని గుర్తుచేశారు. 2014 తర్వాత టీడీపీ హయాంలో రుణాలు 2.24 రెట్లు పెరిగాయని చెప్పారు. గతంలో 19 శాతం రుణాలు పెరగ్గా, ప్రస్తుతం ఈ పెరుగుదల 13 శాతంగా ఉందని ఆయన వివరణ ఇచ్చారు.
 
అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం రుణాలు రూ.4.42 లక్షల కోట్లు అని ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనపై కూడా ఆయన స్పందించారు. కేంద్రం ప్రకటనను ఆధారంగా చేసుకుని ఏపీ అప్పులు రెట్టింపు అయ్యాయని కొందరు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో రుణాలు 19 శాతం పెరగ్గా, ప్రస్తుతం వీటి శాతం 13 శాతంగా ఉందని చెప్పారు.
 
అలాగే, నాన్ గ్యారెంటీ రుణాలు గతంలోనూ ఉన్నాయని చెప్పారు. 2022 సెప్టెంబరు నాటికి రూ.21.673 కోట్లు పెండింగ్‌ బిల్లులు ఉన్నాయని తెలిపారు. కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.1.27 లక్షల కోట్లు అప్పు పొందాయని వెల్లడించారు. ప్రస్తుతం ద్రవ్య లోటు రూ.25 వేల కోట్లుగా ఉందని ఆయన వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు