ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ప్రత్యేకహోదా వల్లే రాష్ట్ర యువతకు భవిష్యత్తు ఉంటుందన్నారు. దానికోసం పోరాడుతున్న యువతను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రదేశాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలపాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటే, ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విశాఖ ఆర్కేబీచ్‌లో నేడు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ప్రకటించింది. జేఏసీ చైర్మన్ అడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ చేస్తున్న ట్వీట్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటనే ఆపడం మంచిదని హితవు పలికారు.