ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్ ఆత్మహత్య.. ఎందుకంటే..

మంగళవారం, 31 జనవరి 2023 (12:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని అమరా ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్‌గా వెంకటేశ్వర రావు ఉన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

ఆర్థిక కష్టాలతో పాటు బ్యాంకర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఈయన సోమవారం పురుగుల మందు సేవించి బలవన్మరణానికిపాల్పడ్డారు. వెంకటేశ్వర రావు పురుగుల మందు సేవించిన విషయాన్ని గుర్తించిన బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించండంతో ఆయన అక్కడ తుదిశ్వాస విడిచారు. 
 
మృతుడి భార్య సుధారాణి వెల్లడించిన వివరాల మేరకు.. గత 2011లో కెనరా బ్యాంకు నుంచి కాలేజీ తరపున రూ.13 కోట్ల రుణం తీసుకున్నారు.

2017 వరకు రూ.25 కోట్లను తిరిగి చెల్లించామని తెలిపారు. అయితే అప్పటికీ అప్పు తీరలేదని బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయిస్తే కళాశాల సామాగ్రిని యాజమాన్యానికి అప్పగించి కళాశాలకు తాళం వేసుకోవచ్చని తీర్పునిచ్చిందన్నారు. కానీ, కెనరా బ్యాంకు అధికారులు మాత్రం సామాగ్రిని ఇవ్వకుండా కాలేజీ మొత్తానికి సీజ్ చేశారని తెలిపారు. 
 
అప్పటి నుంచి నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో కెర్ బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి వివరాలు తెలిపినా ఏ ఒక్క బ్యాంకు అధికారి స్పందించలేదని ఆమె బోరున విలపిస్తూ వెల్లడించారు. పైగా, 2017 నుంచి ఇప్పటివరకు నోటీసులు పంపించి వేధిస్తూనే ఉన్నారని తెలిపారు.

కాలేజీలో ఉన్న సామాగ్రి రూ.16 కోట్లమేరకు వస్తాయని, వాటిని అమ్మితే బ్యాంకు అప్పు తీరిపోతుందన్నారు. కానీ బ్యాంకు అధికారులు తమ మొరను ఆలకించలేదని, ఫలితంగా తన భర్త అమరా వెంకటేశ్వ రావు తీవ్ర మనస్తానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని వాపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు