''నా న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తా.. నీ నగ్న చిత్రాల్ని పంపు''.. ఎఫ్‌బీతో మోసం

గురువారం, 22 సెప్టెంబరు 2016 (12:11 IST)
సోషల్ మీడియా మేలు గోరింతైతే... కీడు కొండంత. అందుకే సోమాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్ వంటివి ఉపయోగిస్తే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్ బుక్ పరిచయం ద్వారా తనతో చదివే అమ్మాయినే వేధించాడో ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేటకు చెందిన సాయిరాం కుమార్‌ స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. 
 
అమ్మాయిల పేరుతో పది నకిలీ అకౌంట్లను ఓపెన్ చేశాడు. ఓ అకౌంట్‌ నుంచి అతడు చదివే కాలేజీ అమ్మాయికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి, చాటింగ్‌ చేశాడు. ఆ సమయంలో "నా నగ్నఫోటోలను షేర్‌ చేస్తా.. నీవు నీ నగ్న చిత్రాలను పంపు'' అని ఆమెను నమ్మించాడు. వివిధ నకిలీ అకౌంట్ల నుంచి ఆమె అకౌంట్‌కు మార్ప్ చేసిన చిత్రాల్ని పంపించాడు.

దీంతో ఆ అమ్మాయి కూడా నగ్న చిత్రాల్ని పంపింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఫోటోలను తల్లిదండ్రులకు షేర్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

వెబ్దునియా పై చదవండి