ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 26వ తేదీ బుధవారం జరుగనుంది. ఇందులో అత్యంత కీలకమైన అంశాలపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టు రద్దు బిల్లులపై ప్రత్యేక ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
నిజానికి ఈ నెల 12వ తేదీన (రెండో బుధవారం) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికల సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. మద్యం, డబ్బు పంపిణీ వంటి ప్రలోభాలకు అభ్యర్ధులెవరైనా పాల్పడితే.. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల తర్వాతా అనర్హుడిగా ప్రకటించేలా ఆర్డినెన్సు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్సు కూడా ఇచ్చారు.