ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జగన్ సర్కారు నోటీసు

సోమవారం, 23 జనవరి 2023 (20:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంఘానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు నోటీసు జారీ చేసింది. సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ ఈ షోకాజ్ నోటీసులో పేర్కొంది. 
 
ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గవర్నర్ హరిచందన్‌ను కలిసి తమ సమస్యలను నివేదించారు. వేతనాలు ఒకటో తేదీనే ఇచ్చేలా ఒక చట్టాన్ని చేయాలంటూ కోరారు. ఇలాగే, ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఈ చర్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసు జారీచేసింది. 
 
సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ ఈ షోకాజ్ నోటీసులు పేర్కొంది. గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం "రోసా నిబంధన"లకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైగా, మీడియాలో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా ఈ నోటీసులు జారీచేసినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 
 
కాగా, ఉద్యోగులు వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే మార్గం ఉందని తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నపుడు గవర్నర్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు