రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బుధవారం, 12 అక్టోబరు 2022 (11:37 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు. ఈ నెల 17వ తేదీన రైతు భరోసా రెండో విడత నిధులను అందిచనున్నట్టు తెలిపారు. 
 
అలాగే, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలోనూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, వచ్చే నెల మొదటి వారంలోనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. 
 
ముఖ్యంగా, ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు గిట్టుబాటు ధర కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. 
 
రంగు మారిన ధాన్యం, బ్రోకెన్‌ రైస్‌ నుంచి ఇథనాల్‌ తయారీపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 15 వ తేదీలోగా డిజిటల్‌, ఫిజికల్‌ రశీదులివ్వాలని అధికారులకు చెప్పారు సీఎం జగన్‌. పొగాకు రైతులకు నష్టం రాకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని జగన్‌ సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు