టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత నియామకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, అనిత వివరణ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేసి తాను క్రిస్టియన్‌కాదని.. నూటికి నూరుపాళ్లు హిందువునని చెప్పారు.
తన ఇంట్లో తులసి కోట, పూజా మందిరం కూడా ఉన్నాయని తెలిపారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ తెలిపారు. తాను ఎస్సీ మాదిగకు చెందినట్టు తన స్టడీ సర్టిఫికెట్లలో ఉందంటూ వాటిని చూపించారు. తన ఇంట్లో ఉన్న హిందూ దేవుళ్ల ఫొటోలు, తులసి కోట, దేవుడి గదిని మీడియాకు చూపించారు.