భార్యను మోసం చేశాననీ భర్త ఆత్మహత్య..

గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:32 IST)
మోసం చేసి పెళ్లి చేసుకోవడాన్ని భర్త జీర్ణించుకోలేక పోయాడు. అనారోగ్యంతోనే ఆయన మృతి చెందాడు. ఆ తర్వాత అతని భార్యను అత్తింటివారు వేధింపులకు గురిచేయసాగారు. దీంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. 
 
చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఊహా రెడ్డి అనే యువతికి నెల్లూరు నగరంలోని ధనలక్ష్మిపురంకు చెందిన విజయేంద్ర రెడ్డితో కొంతకాలం వివాహం జరిగింది. అంతా బాగానే వుందనుకునే సమయంలో పిడుగులాంటి వార్త.. తన భర్తకు రెండు కిడ్నీలు చెడిపోయానని వైద్యులు తెలిపారు. 
 
అయినప్పటికీ భర్తను ప్రేమగా చూసుకుంటూ ఉంది ఆ మహిళ. అయితే విధి ఆమెపై జాలి చూపలేదు. మరోసారి భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు, చేయి చచ్చుబడిపోయాయి. ఇక ఇలాంటి బాధలు భరించలేని భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మహిళ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. అయితే, పెళ్లికి ముందే భర్త ఆరోగ్య పరిస్థితి బాగా లేదని యువకుడి తల్లి దండ్రులకు తెలిసినా చెప్పక పోవడం విశేషం.
 
అనారోగ్యంతో జీవించడం ఇష్టంలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు పోయిన కోడలు, కొడుకు - కోడలికి పుట్టిన ఆరు నెలల పసి బిడ్డను స్వాగతించవలసిన అత్తమామలు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఇంటికొచ్చిన వారిపై దాడి చేసి రక్తపు గాయాలతో వెనుకకు పంపారు. 
 
భర్త ఇంటికి వచ్చిన కోడలిని అత్తమామలు, బంధువులు రాళ్లు, కర్రలతో కొట్టి గాయపరిచారు. గతంలోనూ ఇదేవిధంగా జరిగితే పోలీసులను ఆశ్రయించిన ఊహారెడ్డికి నిరాశే ఎదురైంది. 
 
అయితే కుతురిలా ఆదరించాల్సిన కోడలిపై దాడి చేసిన అత్త మామలకు పెద్ద స్థాయిలో పలుకుబడి ఉండటంతో తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఊహా రెడ్డి ఆరోపిస్తోంది. అధికారులు, ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు