వల్లభనేని వంశీ ప్రసంగిస్తే అంత ఉలుకెందుకు? విత్తమంత్రి బుగ్గన

మంగళవారం, 10 డిశెంబరు 2019 (15:44 IST)
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రసంగిస్తే తెదేపా ఎమ్మెల్యేలకు అంత ఉలికెందుకు అంటూ ఏపీ విత్రమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా, రెండో రోజు మంగళవారం శాసనసభ ప్రారంభమైన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం బాధనిపిస్తోందని అన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రికి చిన్న సూచన అని అచ్చెన్నాయుడు అన్నారు. 
 
దీంతో విత్తమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కలగజేసుకొని.. రోజుకు ఒక్కసారి అయినా మీరు నాలెడ్జ్‌ తెచ్చుకోండి. నా సూచనలు వినండి అని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఐదు సంవత్సరాల నుంచి సూచనలు అందరం విన్నామని, అందరికీ నాలెడ్జ్‌ ఉండాల్సినంత వరకు ఉందని బుగ్గన అన్నారు. సభలోకి రాగానే గౌరవ సభ్యులు వంశీ చేతులు ఎత్తారు. ఏంటి అని అన్నాను. 
 
అంతలోనే టీడీపీ వాళ్లు ఏదో ఊహించుకొని.. ప్రతిపక్షనాయకుడుని తిట్టబోతున్నారు.. ఏదో అనబోతున్నారు అనుకున్నారు. వాళ్లు ఎందుకుపోయారో, ఎందుకు చిన్నచిన్నగా లోపలికి ఎందుకు వచ్చారో వాళ్లకే తెల్సు అని.. 
చూసేలోపు ఒక్కొక్కరుగా లోపలికి వచ్చారని బుగ్గన అన్నారు. ఈ మాత్రానికి అక్కడే ఉండి రూల్స్‌ ప్రకారం అడగవచ్చు కదా అని టీడీపీ సభ్యులకు సూచించారు. 
 
గౌరవ సభ్యుడు వల్లభనేని వంశీ మాట్లాడిన ఐదు నిమిషాల్లో తను చదువుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో.. మాధ్యమంలో ఎలా ఇబ్బంది పడ్డారో, ముఖ్యమంత్రి తీసుకున్ననిర్ణయాలు బావున్నాయని.. నియోజకవర్గంలో కొన్ని విషయాలు మాట్లాడటానికి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలని వంశీ తెలిపారని బుగ్గన అన్నారు. నిజానికి ఎప్పుడైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందరివాడు. 2014 నుంచి ఈ పద్ధతి మారింది. 
 
2014 వరకు ఏ ముఖ్యమంత్రి దగ్గరికి అయినా ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్సీ, రాజకీయ నాయకుడు కలిసేందుకు, నియోజకవర్గ పనులు, వ్యక్తిగత పనుల కోసమైనా వెళ్లేందుకు యాక్సెస్‌ ఉండేది. అయితే, 2016లో మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి టీడీపీ శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తూ.. ఆ తర్వాత ఎక్కడైతే టీడీపీ ఓడిపోయిందో.. అక్కడ టీడీపీ ఇంఛార్జిలకు ఇస్తుంటే.. 46 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోయి ఆనాడు చంద్రబాబు నాయుడుని వెళ్లి కలిస్తే డైరెక్ట్‌గా.. ఐవిల్‌ నాట్‌.. అని అన్నారు. నేను ఇవ్వను అన్నారు. 
 
అప్పటి నుంచి ఓ కొత్త సంస్కృతి ప్రారంభం అయింది. పార్టీకి అతీతంగా పలకరు. పార్టీ నుంచి గెలిచినా వాళ్లకు హక్కులు ఉన్నా ఏవీ ఇక్కడ చేయబడవు అన్నట్లు వ్యవహరించారు. చివరకు, గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులే కాకుండా చివరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కూడా ఇవ్వలేదని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గుర్తుచేశారు. నియోజకవర్గంలో ఎవరో ఒక మనిషికి ఆరోగ్యం బాగోలేకనో, యాక్సిడెంట్‌ అయి.. దెబ్బతగిలి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వచ్చి అడిగినా రూ.25-30 వేలు ఇవ్వలేదన్నారు. 
 
స్వయంగా మేమే బ్లాక్‌1కు వెళ్లి అడిగితే అక్కడ అధికారులు రూలింగ్‌ పార్టీ కాకుండా ఇతరులకు ఇవ్వవద్దని సూచనలు ఉన్నాయి అన్నారు. ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకోలేని వారు పార్టీ కలర్ రాసుకుంటారా అని బుగ్గన ప్రశ్నించారు. అంత మానవత్వం లేకుండా విభజించి రూలింగ్‌ పార్టీ, ఆ పార్టీ అంటూ కొత్త సంస్కృతి నేర్పిస్తే 2019లో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వచ్చాక సీఎం డెవలప్‌‌ఫండ్‌ టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వబడుతుందని చెప్పారని బుగ్గన గుర్తు చేశారు. అది మాట్లాడరు. కానీ, ఈరోజు కూడా అచ్చెన్నాయుడు నాలెడ్జ్‌ తెచ్చుకోవాలట. 
 
సూచనలు వినాలట అనటంపై బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈరోజు వంశీ ఏదో మాట్లాడబోయారు. ఎడ్యుకేషన్‌, ఇంగ్లీషు మీడియం ఆయన తెలిపారు. ఆయన ఏమీ మాట్లాడకముందే వాకౌట్‌ చేశారు. ఎందుకు లోపలికి వచ్చారో కూడా టీడీపీ సభ్యులుక తెల్సు. సభాసమయం అనేది వేస్ట్‌ కాకుండా కొద్దినిమిషాలు ఆగితే అన్ని సర్ధుకుంటాయని అచ్చెన్నాయుడుకు సూచిస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు