నిధులు పుష్కలం... సాంకేతిక సమస్యల వల్లే జీతాలు ఆలస్యం : మంత్రి బొత్స

బుధవారం, 6 సెప్టెంబరు 2023 (09:12 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సాగుతున్న ప్రచారాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. నిధులు పుష్కలంగానే ఉన్నాయని, కానీ, సాంకేతిక కారణాలతోనే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని మంత్రివర్యులు సెలవిచ్చారు. 
 
మంగళవారం జరిగిన టీచర్స్ డే వేడుకల్లో భాగంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై వారికి అభినందనలు తెలపుతూ వారికి పురస్కారాలను అందజేశారు. 
 
ఉపాధ్యాయులకు వేతనాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని కొందరు విమర్శిస్తున్నారని, అయితే, సాంకేతిక కారణాలతో జీతాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ఈ నెల 7 లేదా 8 తేదీల్లో ఉపాధ్యాయులకు వేతనాలు జమ చేస్తామని చెప్పారు. ఇక ఉపాధ్యాయ నియామకాలపై ఆయన స్పందిస్తూ, నెల రోజుల్లో అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతామని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు