మూడు రోజుల క్రితం ఏఎస్పీ అనంతపురం వెళ్లారు. ఆ సమయంలో ఏఎస్పీ తుపాకీని హోంగార్డు వద్ద ఉంచారు. దాన్ని హోంగార్డు ఇంటికి తీసుకువచ్చాడు. మొదట ఇంట్లో తుపాకీ మిస్‌ఫైర్ అయినట్లు హోంగార్డు చెప్పాడు. బుల్లెట్.. అతడి భార్య సూర్యరత్నప్రభ గుండెల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.