కొత్త బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహిస్తా : బండారు దత్తాత్రేయ

సోమవారం, 2 సెప్టెంబరు 2019 (16:40 IST)
కొత్త బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. 
 
తాజాగా ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించిన విషయం తెల్సిందే. బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గానూ, తెలంగాణ రాష్ట్రానికి తమిళనాడుకు చెందిన బీజేపీ చీఫ్ తమిళిసై సౌందరాజన్ నియమితులయ్యారు. 
 
తన నియామకంపై బండారు దత్తాత్రేయ స్పందిస్తూ, కష్టపడి పనిచేసినవారికి తగిన గుర్తింపు ఉంటుందనడానికి తన నియామకమే నిదర్శనమన్నారు. పార్టీ తనకు గతంలో అప్పజెప్పిన పలు బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించానని, అదేరీతిలో నూతన బాధ్యతలను సైతం నిర్వర్తిస్తానని చెప్పారు. 
 
తనకు గుర్తింపునిచ్చి.. గవర్నర్‌గా అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు బీజేపీ సీనియర్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. దత్తాత్రేయకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుసహా పలువురు ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు