గురువారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... కరీంనగర్ సమీపంలోని విజయపురి కాలనీకి చెందిన ప్రేమికులు మహాంకాళి అనిల్ (21), అస్తపురం మౌనికలు గత ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూతురు మైనర్ కావడంతో అమ్మాయి బంధువులు యువకుడిపై కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
ఇటీవలే జైలు నుంచి విడుదలైన అనిల్.. మౌనిక మైనారిటి తీరడంతో తిరిగి ఆమెను పెళ్లి చేసుకోవడానికి గురువారం ఏర్పాట్లు చేసుకున్నాడు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రేమజంట బుధవారం పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో స్థానిక ఎల్ఎండీ కాలనీలోని తపాల నర్సింహస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.