వాస్తవానికి తెనాలి పట్టణానికి మినీ సింగపూర్ అనే పేరు వుంది. ఎందుకంటే ఈ పట్టణం మధ్యగుండా కృష్ణా నది నుంచి కాలువ వెళుతుంది. ఈ కాలువకి అటువైపు ఇటువైపు రోడ్డు వుంటుంది. ఇది తెనాలి పట్టణం మధ్యగా వెళుతుంటుంది. ఐతే ఈ కాలువకు పక్కనే వున్న రోడ్డు మాత్రం అధ్వాన్నంగా వుంది. ఇదే కాదు... పట్టణంలో చాలాచోట్ల ఇరుకు సందులు, గతుకుల రోడ్లు, పాతబడిపోయిన విద్యుత్ స్తంభాలు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు. ఈ సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు.