సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

బుధవారం, 7 ఆగస్టు 2019 (11:50 IST)
దేశ మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణానికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె.చంద్రశేఖర రావు తీవ్ర సంతాపం ప్రకటించారు.
 
వివిధ హోదాల్లో సుష్మా స్వరాజ్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. సుష్మా స్వరాజ్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
 
సుష్మా స్వరాజ్ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. సుష్మా స్వరాజ్ మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.

సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మంగళవారం రాత్రి హఠాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆమె లోకసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈమె ఏడుసార్లు ఎంపీగాను, రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు