తాత చంద్రబాబు కంటే మనవడు దేవాన్ష్ కోటీశ్వరుడా...?! బాబుకు తెల్లరేషన్ కార్డు ఇస్తారేమో...?

గురువారం, 20 అక్టోబరు 2016 (19:56 IST)
విజ‌య‌వాడ ‌: డెబ్బ‌య్యేళ్ళ తాత క‌న్నా... నెల‌ల బాలుడైన మ‌న‌వ‌డికే ఆస్తి ఎక్కువ‌గా ఉంద‌ని చంద్ర‌బాబు ఆస్తుల‌పై సీపీఐ నేత చ‌మ‌త్క‌రించారు. ఏపీ సీఎం చంద్రబాబు కన్నా... ఆయన మనుమడు దేవాంశే కోటీశ్వరుడా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్ర‌శ్నించారు. నారా లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాలు చూస్తుంటే, చంద్రబాబుకి తెల్ల రేషన్ కార్డు ఇప్పించేట్టున్నాడ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. 
 
ఆస్తుల వెల్లడి ఆదర్శంగా ఉండాలేగాని, అపహాస్యంగా ఉండకూడద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి విమ‌ర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ తమ కుటుంబ ఆస్తులను ప్రకటించ‌డం, తన తల్లి బువనేశ్వరి, భార్య బ్రాహ్మణి లు హెరిటేజ్ కంపెనీ కోసం బాగా కష్టపడుతున్నారని చెప్ప‌డం... భువనేశ్వరి నుంచి దేవాన్ష్ కు తొమ్మిది కోట్ల ఆస్తులు బదిలీ కాగా, అతనికి మొత్తం మీద 11 కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్నట్లు లోకేష్ చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు

వెబ్దునియా పై చదవండి