రోజూ తప్ప తాగి భార్యాపిల్లల్ని వేధించాడు. చుక్కేసి ఇష్టానికి మాట్లాడేవాడు.. భార్యాపిల్లలపై చేజేసుకునేవాడు. సంవత్సరాల పాటు తాగుబోతు భర్తను, తండ్రిని వారు భరించారు. కానీ వారి సహనం కోల్పోయింది. దీంతో తాగుబోతును చంపేశారు. ఈ ఘటన ముప్పాళ్లలో చోటుచేసుకుంది.
జూలై ఐదో తేదీన మరియదాసును తన నివాసంలోనే భార్య ఝాన్సీరాణి, కుమారులు ధనరాజు, విజయ్‌లు పచ్చడి బండతో తలపై కొట్టి హత్య చేశారని, అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా సత్తెన పల్లి రైలు పట్టాలపై పడేశారని పోలీసులు వెల్లడించారు. అనుమానం మేరకు కుటుంబ సభ్యులపై విచారణ జరపడంతో హతుడు మరియ దాసు అతిగా మద్యం తాగి తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ప్రతి రోజూ వేధింపులకు గురిచేసేవాడని, ఆ వేధింపులకు తట్టుకోలేక హత్యచేసినట్లు భార్య ఝాన్సీరాణి అంగీకరించిందని సీఐ తెలిపారు.