వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 23 నుంచి వచ్చే నెల 3 వరకు దర్శన టిక్కెట్లు, ఉచిత దర్శనం టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దర్శన టిక్కెట్లు లేకుండా నేరుగా తిరుపతి కొండకు వచ్చే భక్తులకు 10 రోజుల పాటు ఉచిత దర్శనానికి అనుమతించబోమని ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి తెలిపారు.
అందుచేత భక్తులు తిరుపతిలోనే ఉండి స్వామివారిని దర్శించుకోవాలని ధర్మారెడ్డి చెప్పారు. దర్శనం టిక్కెట్లు, ఉచిత దర్శనం టోకెన్లను తీసుకువచ్చే భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠ ద్వారంలో ప్రవేశించేందుకు ఈ 22వ తేదీ నుంచి తిరుపతిలోని కౌంటర్లలో 4 లక్షల 25 వేల ఉచిత దర్శన టోకెన్లు ఇవ్వనున్నారు.