తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు నగరం ఏటీ అగ్రహారానికి చెందిన ఒక మహిళ తన భర్త వికృత నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎటువంటి పనులు చేయకుండా, యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసి డబ్బులు సంపాదించాలనుకున్న భర్త, భార్యతో ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోలు తీసిన ఘటన వెలుగు చూసింది.
పోలీసులు యుద్ధప్రాతిపదికన కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పుడు అప్‌లోడ్ చేశాడు, ఎన్ని వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్‌లో కాకుండా, ఇతరత్రా సామాజిక మాధ్యమాల్లో ఏదైనా అప్‌లోడ్ చేశాడా...? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదును స్వయంగా అర్బన్ పోలీసు ఉన్నతాధికారి పరిశీలిస్తున్నారు.