కోడలిపట్ల మామ అసభ్య ప్రవర్తన.. పొరుగింటివారికి చెప్పడంతో.. యాసిడ్ తాగి.. కత్తితో గొంతుకోసుకున్నాడు..

సోమవారం, 14 నవంబరు 2016 (09:30 IST)
మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. అలా కోడలిపట్ల మామ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం కాస్త పొరిగింటి వారికి తెలియడంతో మామ ఆత్మహత్యతకు పాల్పడిన ఘటన హైదరాబాద్.. బోడుప్పల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్‌ ఇందిరానగర్‌లో బద్దుల కృష్ణ(60) కొడుకు, కోడలితో కలిసి నివసిస్తున్నాడు.
 
కృష్ణ కోడలిపై శనివారం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకొని బయటకు వెళ్లి ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పింది. భయపడిన అతడు ఇంట్లోని ఓ గదిలోకెళ్లి తలుపులు బిగించుకొని యాసిడ్‌ తాగి కత్తితో గొంతు కోసుకున్నాడు. 
 
విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చిన అతడి కుమార్తె  తలుపులు తొలగించి లోపలికెళ్లి చూడగా.. తండ్రి రక్తపు మడుగులో పడి ఉండడం కనిపించింది. గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి