కొడాలి నాని పంచ్‌లు మామూలుగా వుండవు. తనదైన స్టైల్లో బిగ్ టీవీ రిపోర్టర్ కి సెటైరికల్ జవాబులు చెబుతూ కాసేపు అందరి దృష్టిని మరల్చారు కొడాలి నాని. కొడాలి నాని గారు ఇన్నిరోజులు ఏమైపోయారు? అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు... ఏమైపోవడం ఏంటమ్మా... మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తానంటూ సెటైర్ విసిరారు నాని. ఇంకా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు కొడాలి నాని ఇచ్చిన సమాధానాలు ఏమిటో చూడండి.
రిపోర్టర్: కొడాలి నానిగారు ఇన్నిరోజులు ఏమైపోయారు?
నాని: ఏమైపోవడం ఏంటమ్మా... మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా. కాదమ్మా... రాధాకృష్ణకు, నీకు, బీఆర్ నాయుడుకి ఇలా మీ పేర్లు చెబితే కనబడి వెళ్తా రోజూ....
రిపోర్టర్: అంతకుముందు బాగా యాక్టివ్‌గా వుండేవాళ్లు, కమ్యూనికేట్ చేసేవాళ్లూ...