బుధవారం ఉదయం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలవడం కోసం ఈ నెల 20న సిద్ధార్థ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయిలో ఇన్కెండో-2కె19ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇన్కెండో ఈవెంట్‌లో క్విజ్, ఫ్లోర్క్రాసింగ్, దళాల్ స్ట్రీట్ (షేర్మార్కెట్), యాడ్ మ్యాడ్, ఫైనాన్షియల్ అనలిస్ట్, డాన్స్ టు ట్రిబ్యూట్, మైండిట్, ఇన్కెండొ క్రికెట్ లీగ్, మిస్టర్ అండ్ మిస్ ఇన్కెండొ మొదలగు అంశాలలో విద్యార్థులు పోటీ పడనున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఈవెంట్‌కు సంబంధించి రూపొందించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో కళాశాల డీన్ డాక్టర్ రాజేష్ సి జంపాల, కామర్స్ విభాగాధిపతి కె.నారాయణరావు, అధ్యాపకులు సుభాకర్ పెదపూడి, సీహెచ్ ప్రసన్నకుమార్, ధర్మేంద్ర , ఇ.సువర్ణాంజలి, శివరంజని, కనకదుర్గ, కామర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.