రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ఠాగూర్

సోమవారం, 7 ఏప్రియల్ 2025 (13:07 IST)
రైలు ప్రయాణంలో వెంట తీసుకెళ్లే లగేజీపై రైల్వేశాఖ కొత్త నిబంధన తీసుకొచ్చింది. మోసుకెళ్లేది మేమే కదా అని ఇష్టారీతిన లగేజీ తీసుకెళ్లడం కురదని తేల్చిచెప్పింది. విమానాశ్రయాల తరహాలో రైల్వే స్టేషన్‌లో కూడా లగేజీకి చార్జీలు వసూలు చేయనున్నమారు. 
 
కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 70 కేజీల వరకు లగేజీని అనుమతిస్తారు. ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కేజీలు, ఏపీ 3 టైర్, స్లీపర్, జనరల్ ప్రయాణికులు మాత్రం తమ వెంట 40 కేజీల లగేజీని వెంట తీసుకెళ్లవచ్చని రైల్వే శాఖ తెలిపింది. 
 
అనుమతించిన బరువు కంటే ఎక్కువ బరువున్న లగేజీని తీసుకెళుతూ పట్టుబడితే మాత్రం జరిమానా విధిస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. టికెట్ రేటు కంటే ఈ జరిమానా ఆరు రెట్లు అధికంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు