ఏపీలో సీబీఐ అడుగుపెడితే జగన్ ప్యాంటు తడిచిపోతోంది : నారా లోకేశ్

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (07:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీబీఐ అధికారులు అడుగుపెడితే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళ్లు వణికిపోతున్నాయని, ప్యాంటు తడిచిపోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పైగా, జగన్ రెడ్డి పతన నెల్లూరు జిల్లా నుంచే మొదలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు జగన్‌పై తిరుగుబాటు చేసిన విషయం తెల్సిందే. దీంతో వారిపై వైకాపా అధిష్టానం వేటు వేసింది. అందుకే జగన్ పతనం నెల్లూరు నుంచే మొదలైందని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, లోకేశ్ చేపట్టిన పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఆయన తన పాదయాత్రలో భాగంగా పలమనేరు క్లాక్ టవర్ సెంటరు జన సముద్రాన్ని తలపించింది. వారినుద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ, అందరినీ ఉద్ధరిస్తానంటూ ఎన్నికలకు ముందు జగన్ చెబితే అందరూ నమ్మారన్నారు. ఉద్యోగాలు ఇస్తానని,45 యేళ్లకే పెన్షన్లు ఇస్తానంటే మురిసిపోయారన్నారు. అందుకే 151 సీట్లలో జగన్‌కు అధికారాన్ని కట్టబెట్టారని గుర్తుచేశారు. మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలో అలా చేసేరాని మండిపడ్డారు. 
 
25 ఎంపీ సీట్లు వస్తే ప్రత్యేకహోదా తెస్తానని చెప్పిన జగన్.. కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ ముందు మోకరిల్లుతున్నారన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని గుర్తుచేశారు. తల్లి, చెల్లిని మెడబట్టి బయటకు గెంటేసిన వాడిని ఏమంటారని క్రిమినల్స్ అంటారన్నారు. తాడేపల్లిలో ఒక క్రిమినల్ ఉంటాడని, ఆయన చుట్టూ మరికొందరు క్రిమినల్స్ ఉంటారని ధ్వజమెత్తారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జరిగిన ఓ స్కామ్ వెనుక మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందని ఆయన లోకేశ్ ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు