కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య.. పెళ్లైన 2 రోజులకే కొత్త పెళ్ళికొడుకు సూసైడ్..?

ఆదివారం, 13 నవంబరు 2016 (11:49 IST)
కుటుంబ కలహాలతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారే హత్యచేసి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బలబోయిన అనూష(22) శనివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  
 
మరోవైపు కరీంనగర్‌ జిల్లాలోని సైదాపూర్‌ మండలం జాగిరిపల్లెలో ఓ విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామంలో నివసిస్తున్న అమ్మిరాజు అనే 28 ఏళ్ల వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అమ్మిరాజుకు పెళ్లి జరిగి రెండు రోజులు మాత్రమే అవుతుంది. దీంతో వధూవరుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో బంధువులు కూడా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి