జనసేన సరైన దిశలోనే పయనిస్తోంది.. ఆ తపన పవన్‌లో వుంది

సెల్వి

శనివారం, 10 ఫిబ్రవరి 2024 (20:54 IST)
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ జనసేనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తే ప్రతి ఒక్కరికీ నమస్కారం పెట్టాలన్నారు. రాజకీయాల్లోకి వస్తే డబ్బులు ఖర్చు పెట్టాలి. అదే సినిమాల్లో అయితే, ప్రజలే డబ్బులిచ్చి సినిమాలకు వస్తుంటారని వివరించారు. 
 
అలాంటి జీవితాన్ని వదులుకుని పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, మార్పు తీసుకురావాలన్న తపన అతడిలో ఉందని జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. కొత్త పార్టీ అయిన జనసేన సరైన దిశలోనే పయనిస్తోందని అభిప్రాయపడ్డారు. 
 
మనదేశంలోని ఎన్నికల వ్యవస్థ కొత్తగా వచ్చే పార్టీలకు వ్యతిరేకమైన వ్యవస్థ అని జయప్రకాశ్ అన్నారు. ఒక్క ఓటు తగ్గితే ఓటమి.. ఒక్క ఓటు ఎక్కువైతే విజయం. ఈ విధానాన్ని బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకున్నాం. దీన్ని తీసుకోకుండా వదిలేయాల్సింది. కానీ కొనసాగించాం. అందువల్ల మూడో పార్టీకి చాలా కష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండు పార్టీలు బలంగా వేళ్లూనుకున్న చోట మూడో పార్టీకి పతనం అయ్యే పరిస్థితులు తప్పడంలేదు.  
 
కొత్తగా వచ్చిన పార్టీలు నిలదొక్కుకోవాలంటే ఏదో రకంగా పొత్తులు అనివార్యం. పొత్తులు లేకపోతే కొన్ని ఓట్లు వస్తాయి కానీ, రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉండదని జయప్రకాష్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు