నన్నారి వేర్లు అమ్ముకునే వృద్ధుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అతనితో సహజీవనం చేసే మహిళే ఆ వృద్ధుడి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి మండలం ముసలివేడుకు చెందిన మునిలక్ష్మీ అలియాస్ ధనలక్ష్మీ, నారాయణవనం మండలం కన్యకాపురానికి చెందిన టి.బాలాజి అలియాస్ బాలకృష్ణ సహజీవనం సాగిస్తున్నారు.
సహజీవనం చేస్తున్న బాలాజీకి ఈ విషయం తెలియరావడంతో నారాయణప్పను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. నెల రోజుల కిందట మునిలక్ష్మీతో కలిసి నారాయణప్పను హత్య చేశారు. అలంపూర్ అటవీ ప్రాంతంలో అస్తి పంజరం పడి ఉందని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కదిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ అస్థిపంజరం నారాయణప్పదని విచారణలో తేలింది. ఇతని హత్యకు ధనలక్ష్మి కారణమని వెల్లడి అయ్యింది.