ఏపీలో కరోనా విజృంభణ.. ఆదోనీ హాస్టల్‌లో 52మంది విద్యార్థినులకు పాజిటివ్

ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (13:09 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండటం తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది.
 
ఆదోని కస్తూర్భా గాంధీ హాస్టల్‌లో కరోనా కలకలం రేపుతోంది. 52 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే ప్రిన్సిపాల్ శాంతి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
పాఠశాల సముదాయంలోనే ఓ గదిలో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో విద్యాసంస్థల్లోనూ కరోనా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు