కేసీఆర్‌-లగడపాటిల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది.. ఆంధ్రా ఆక్టోపస్ అంతా మాటన్నారా?

ఆదివారం, 15 జనవరి 2017 (17:10 IST)
తెలుగు రాజకీయాల్లో బద్ధశత్రువులుగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. లగడపాటి.. ప్రస్తుతం ఏకమైనట్లు కనిపిస్తోంది. కేసీఆర్ దీక్షను అపహాస్యం చేసి, తెలంగాణా ఉద్యమానికి 'శిఖండి' లాంటోడని తీవ్రమైన వ్యతిరేకత కూడగట్టుకున్న లగడపాటి.. ఇప్పుడు సడన్‌గా ఇలా ప్లేట్ ఫిరాయించారు.

రాజకీయాలకు దూరంగ ఉంటున్న లగడపాటి.. యాదాద్రిలో మెరిశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యదర్శనం తర్వాత.. లగడపాటి చెప్పిన నాలుగు మాటలు మాత్రం ఆణిముత్యాల్లా అనిపించాయి. యాదాద్రిని వృద్ధి చేయాలన్న ఆలోచనే అద్భుతమని.. దీనికి నడుం కట్టిన కేసీఆర్ ధన్యుడని లగడపాటి కొనియాడారు. 
 
ఆధునీకరణ పనులు పూర్తయితే.. యాదాద్రి తిరుమల కొండను మరిపిస్తుందని.. ఆ క్రమంలో కేసీఆర్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించాల్సిదేనని చెప్పి.. మరో స్టెప్ ముందుకేశారు. ఇంకేంముంది... రాజకీయ జోస్యం చెప్పడంలో ఆరితేరి.. ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్న ఘనత లగడపాటి రాజగోపాల్ ఖాతాలో వుంది. ఆలెక్కన ఇప్పుడు కేసీఆర్ గురించి చెప్పిన మాటలు కూడా నిజమవుతాయా అని అందరూ భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి