ఉద్యోగం ఇప్పిస్తానని రాయ్‌చూర్ తీసుకెళ్లాడు.. బీటెక్ యువతిని వాడేసుకున్నాడు...

బుధవారం, 5 జులై 2017 (13:39 IST)
ఉద్యోగం పేరుతో బీటెక్ పట్టభద్రురాలు మోసపోయింది. ఆమెకు ఉద్యోగం ఆశచూపి కర్ణాటక రాష్ట్రంలోని రాయ్‌చూర్‌కు తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నాడు. తీరా తాను మోసపోయానని గ్రహించిన బీటెక్ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ప్రకాశం జిల్లా ఆణుమల్లిపేటకు చెందిన వివాహితుడు ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన బోడ్డు మోహన్‌ మురళీకృష్ణ అదే వీధికి చెందిన బీటెక్‌ చదివి హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్న యువతి వద్దకు వెళ్లాడు. ఆమెతో మాయమాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తాని నమ్మబలికాడు. ఆ తర్వాత రాయచూర్‌ తీసుకెళ్లి స్నేహితుడి రూములో ఉంచి యువతిని కొన్ని రోజులు శారీరకంగా అనుభవించాడు. 
 
అనంతరం నాలుగు రోజుల కిందట తిరిగి యువతిని తీసుకుని ఆణుమల్లిపేటకు వచ్చాడు. యువతి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. యువకుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేసి కోర్డులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి