కేంద్రం పాత నోట్లను రద్దు చేయడంతో అందరూ ఇబ్బంది పడుతున్నారన్నారు. మహిళలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారని, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా నోట్ల రద్దుపై కేంద్రం దూకుడుగా నిర్ణయం తీసుకుందని ఆమె కేంద్రంపై తీవ్రంగా మండింది. కొందరు నల్లకుబేరుల కోసం అందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదని, కొత్తగా రూ.2 వేల నోటును తేవడం అనాలోచిత నిర్ణయమని ఆమె పేర్కొన్నారు.